మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషం.
దీంతో తుళ్లూరు పోలీసులు బుధవారం సురేశ్‌ను అరెస్టు చేసేందుకు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన కోసం వెళ్లారు. అయితే, అరెస్టుపై సమాచారంతో ఆయన తన ఫోన్ స్విచాఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు కొంత సేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వచ్చారు.
ఆ తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేశ్ బుధవారం ఉదయం నుంచి ఎక్కడా ఉన్నారో పోలీసులు విచారణ చేపట్టారు. దాంతో పోలీసులకు ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వెంటనే హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ తదితరులు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో గుంటూరు, బాపట్ల, పన్నడకు చెందిన 12 మంది పోలీసు బృందలు వెతుకుతున్నారు.