- రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- అభివృద్ధి పనులకు శ్రీకారం
ముద్ర ప్రతినిధి కరీంనగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీ బుధవారం వేములవాడలో ర న్ ఇన్‌నిటిని, ఈ పర్యటనను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. మంగళవారం వెలిచాల రాజేందర్ రావు వేములవాడలో ఉన్నారు. ముఖ్యమంత్రి విజయవంతం చేయడంపై నాయకులు, కార్యకర్తలతో పర్యటన మాట్లాడారు. ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు ప్రారంభించే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారి ఉమ్మడిగా వేములవాడలో మొట్టమొదటిసారిగా పర్యటిస్తున్నారని తెలిపారు. పలు అభివృద్ది కార్యక్రమాలు, శంఖుస్థాపనలు చేస్తారని తెలిపారు. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ది, విస్తరణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. 2023-24 బడ్జెట్‌లో రాజన్న ఆలయానికి 50కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. తాజాగా వేములవాడ ఆలయాభివృద్ధి కోసం 130 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏటా 100 కోట్లు కేటాయిస్తానని మోసం చేసి రంగు రంగుల బ్రోచర్లతో కాలం వెల్లదీ శారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ విస్తరణకు శంఖుస్థాపన చేస్తారని, రాజన్న ఆలయం, పట్టణ అభివృద్ధి సమాంతరంగా ఉంటుందన్నారు. నేతన్నల 30 సంవత్సరాల చిరకాల కోరిక అయిన యారన్ డిపో కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని, సోమవారం దీనికి 50 కోట్లు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నెంబర్ 2గా ఉన్న యువరాజు కూడా యారన్ డిపో తేలేక పోయాడని, యారన్ డిపో ఏర్పాటు చేస్తే కొందరు బిఆర్ఎన్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్ గా ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఒక్క నయా పైసా రాజన్న ఆలయానికి ప్రసాద్ స్కీము ద్వారా తీసుకు రాలేకపోయారని. నేతన్నల ను వరంగల్ తరలి పోయేలా చేశారు. స్కీం ఉన్నప్పుడు కూడా యార్న్ డిపో కూడా తేలేదని పేర్కొన్నారు. నేతన్నల చావులకు కారణమైన బీఆర్ఎస్, బిజెపి చేసిన పనులను సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారని తెలిపారు. బతుకమ్మ చీరల బకాయిలు 200 కోట్లు పెద్ద మనసుతో విడుదల చేశారు. అలాంటి మనసున్న మారాజు మన వేములవాడకు వస్తున్న మనందరం మూకుమ్మడిగా స్వాగతం పలకడం ఎంతైనా అవసరం అని పేర్కొన్నారు. నిండు మనసుతో ఆశేష జనావళితో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఘనంగా స్వాగతం పలుకుదామని వెలిచాల రాజేందర్ రావు.
2018లో ముంపు గ్రామాల ప్రజలకు ఆశల పల్లకీలో కేసీఆర్ ఆనాడు డబుల్ బెడ్ రూం కింద ఇస్తానని మోసం చేశారు. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ముంపు గ్రామాల ప్రజలకు 4400 ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని తెలిపారు. దీనికి దాదాపు 220 కోట్లు ఇచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కృషిని రాజేందర్ రావు పేర్కొన్నారు.