- పేదవారికి చేస్తున్న సేవను గుర్తించిన మనం ఫౌండేషన్ పొదిల శ్రీధర్ కు డాక్టర్ రేట్ అలాగే భారత సేవారత్న అవార్డు అందజేత
- మున్ముందు పేద ప్రజల కోసం ఇలాగే కృషి చేస్తా – డాక్టర్ పొదిల శ్రీధర్
తుంగతుర్తి ముద్ర :- తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన పొదిల శ్రీధర్ దశాబ్దంగా వయోభారంతో చూపుకోల్పోయి కంటి ఆపరేషన్ చేయించుకోలేని సుమారు పదివేల మంది నిరుపేదల కోసం ఎన్నో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి కంటిచూపు ప్రసాదించి తన వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది.
అంధ’త్వంతో బాధపడుతూ.. వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి శుక్లాలను తొలగించడానికి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మందికి అండగా నిలిచిన డాక్టర్ పొదిల శ్రీధర్ నటన సేవలను గుర్తించింది. భారత సేవా రత్న అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది. వివరాల్లోకి వెళ్తే.. గత 10 సంవత్సరాలుగా పొదిల శ్రీధర్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి.. అంధత్వంతో బాధపడుతున్న పేద, బడుగు బలహీనవర్గాలకు చెందిన 10 వేల మందికి పైగా వృద్ధాప్యంతో వచ్చే శుక్లను ఆపరచారు. శ్రీధర్ చేసే ఈసేవలకు పుష్పగిరి ఆసుపత్రి, యాజమాన్యం, డాక్టర్ విశాల్ గోవింద్ ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా శ్రీధర్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తన సేవను గుర్తించి అవార్డును అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇకముందు కూడా ఇలాగే తన సేవలను కొనసాగిస్తానని డాక్టర్ శ్రీధర్ తెలిపారు.