వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులను బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరని, వారిపై ఈగ వాలినా జగనే బాధ్యత వహించాలంటూ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఆదివారం నిర్వహించినశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు అధికారులకు ఎవరైనా వార్నింగ్ ఇస్తే సుమోటాగా తీసుకుని కేసులు పెడతామని సూచించారు. పోలీసులు, అధికారులపై ఇష్టం వచ్చినట్టు జగన్, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న పవన్.. తమది ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని. 20 ఏళ్లు అధికారంలో ఉంటామని చెప్పి పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారని, రోడ్డు మీద నిరసనలు చేస్తున్న మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టించారని చెప్పారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడిని సప్త సముద్రాలు ఆవల ఉన్నా వదలమని జగన్ అంటున్నారని.. డీజీపీని రిటైర్ అయినా వదలమని భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదన్న పవన్ కల్యాణ్.. ఇంట్లో రోడ్డు మీద ఆడ బిడ్డలకు రక్షణ లేదని విమర్శించడం సమంజసం కాదన్నారు.
గతంలో సీఎం పర్యటనలు పేరుతో ఇష్టానుసారంగా రోడ్ల పక్కన ఉన్న చెట్లు నరికేశారని, ఈ చర్యలు పర్యావరణాన్ని దెబ్బతీశాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెట్ల నరికివేత మీద చర్యలు మొదలుపెడితే వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు ఊచలు లెక్కించాల్సి వస్తుంది. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఊహించనన్ని సమస్యలు కూటమి ప్రభుత్వానికి వచ్చాయన్న పవన్ కల్యాణ్ ఈ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలు అర్ప మరణం పొందిన సిబ్బంది త్యాగాలు వృథా కానీయమన్న పవన్ కల్యాణ్. సంపద పరిరక్షణలో ఒక ఐఎఫ్‌ఎస్ అధికారితోపాటు 23 మంది సిబ్బంది ప్రాణాలను కోల్పోయారని, విధి నిర్వహణలో అసువులు బాసిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా.? సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్
నాయకుడిగా ఎదగాలంటే చాణక్యుడు చెప్పిన 4 లక్షణాలు ఇవే..