Home » మొన్న భట్టి.. నిన్న శ్రీధర్ బాబు – మంత్రుల ఇంట్లో మళ్లీ చోరీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

మొన్న భట్టి.. నిన్న శ్రీధర్ బాబు – మంత్రుల ఇంట్లో మళ్లీ చోరీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
మొన్న భట్టి.. నిన్న శ్రీధర్ బాబు - మంత్రుల ఇంట్లో మళ్లీ చోరీ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర, తెలంగాణ బ్యూరో :మంత్రుల ఇండ్లలో దొంగలు పడుతున్నారు. సెక్యూరిటీ ఉండే రాజకీయ నాయకుల ఇంట్లోనే చోరీలు జరగడంతో మిగిలిన సామాన్య కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి వాటిల్లుతుందని ప్రజలు భయపడుతున్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మంత్రి ఇంట్లో దీపావళి రోజున మొబైల్ చోరీకి గురైందని, వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఇంట్లో ఇటీవల చోరీగా జరగ్గా.. ఇప్పుడు మళ్లీ మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మంత్రి ఇంట్లో దీపావళి రోజున మొబైల్ చోరీకి గురైనట్లు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీపావళికి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

గతంలో డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ

ఇదిలా ఉండగా, ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఇంట్లో కూడా చోరీ జరిగింది. భట్టి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు. చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే పోలీసులు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు దొంగలమని ఒప్పుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్, ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌గా పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in