Home » ఆదాయాన్వేషణ..! పెరిగిన విక్రయాలు.. పెరగనున్న ధరలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఆదాయాన్వేషణ..! పెరిగిన విక్రయాలు.. పెరగనున్న ధరలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
ఆదాయాన్వేషణ..! పెరిగిన విక్రయాలు.. పెరగనున్న ధరలు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • మద్యం సేవించడంలో దేశంలోనే తెలంగాణ
  • మద్యం ధరలు పెంచాలని సర్కార్ నిర్ణయం
  • సీఎం, మంత్రులకు నివేదిక
  • సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమల్లోకి కొత్త ధరలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మద్యం వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణలో లిక్కర్ ధరల పెంపునకు కసరత్తు పూర్తయింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఒక్కో బీరు టిల్ పై రూ.20, లిక్కర్ బాటిల్స్ పై రూ.20 నుంచి రూ. 70లు పెంచాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రస్తుతం ఆ ఫైలు సీఎం, రాష్ట్ర మంత్రుల వద్ద పెండింగ్‌లో ఉంది. మద్యం ధరల పెంపునకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ధరల పెంపు అమల్లోకి రావడం ఖాయమనిపిస్తోంది. అయితే కొత్తగా ఉన్న మద్యం ధరలతో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.1000 కోట్ల వరకు అదనపు ఆదాయం చేకూర్చడానికి ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేసింది. పది రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇతర నెలల హామీలు నెరవేర్చేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుత ప్రభుత్వానికి ఆదాయమార్గాలు లేకపోవడంతో తాజాగా మద్యం వినియోగాలను పెంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్త అయినా గట్టెక్కాలని సర్కార్ కోరుతోంది. ఇదిలావుంటే.. మంత్రులు, పలు శాఖలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూర్చేలా సలహాలు, సూచనలు అందించిన విషయం తెలిసిందే. ఒప్పందం శాఖల వారీగా సుదీర్ఘ కసరత్తు చేపట్టిన మంత్రులు, మద్యం ధరల పెంపుపై ఏకభ్రష్టత్వానికి వచ్చారు. ఈ రాష్ట్రానికి అధిక ఆర్థిక వనరుగా ఉన్న మద్యంపై ఆదాయం ఆర్జించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖను కలిగి ఉంది. దీంతో ఆ శాఖ అధికారులు బీర్లు, లిక్కర్ బాటిల్ పై కనీసం రూ.20 నుంచి ధరలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,260 మద్యం దుకాణాలు, 1,171బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటుగా పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.

సెప్టెంబర్ 30 వరకు 2 838 కోట్ల అమ్మకాలు జరగ్గా… అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ. 1,100 కోట్ల మేర విలువైన బీర్ల ఉత్పత్తి కేంద్రాల (బ్రూవరీల)కు ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10-15 శాతం మేర పెంచాలని.. మద్యం ధరలు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. తెలంగాణలోని 6 బ్రూవరీల్లో ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి జరుగుతోంది. 12 బీర్లు ఉండే ఒక కేసుకు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లైట్‌ బీర్లకు రూ.289, స్ట్రాంగ్‌ బీర్లకు రూ.313 చెల్లిస్తున్నది. ప్రస్తుతం మద్యం దుకాణాలు ఒక్కో కేసు రూ.1,800 చొప్పున అమ్ముకుంటున్నాయి. తయారీ కేంద్రాల వద్ద సుమారు రూ.24కి లభించే ఒక బీరు.. వినియోగదారులకు వచ్చేసరికి రూ.150 అవుతుంది. అయితే, బ్రూవరీల నుంచి వచ్చిన ప్రతిపాదనల పైన అధికారులు కసరత్తు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. అయితే, గతంలోనూ ఇదే రకమైన ప్రచారం జరగ్గా, నాడు ప్రభుత్వం ఖండించింది. కానీ, ఇప్పుడు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మద్యం ఆదాయానికి అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెరిగేలా ఆలోచనలు ఉన్నాయి. దీని పైన ప్రభుత్వం అధికారికంగా తమ నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.

మద్యం విక్రయాల్లో తెలంగాణ టాప్

మద్యం విక్రయాలలో తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని నేషనల్ ఇనీడ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ చేసిన సర్వేలో తెలంగాణలో గత ఏడాది అత్యధిక మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణలో మద్యం కోసం సగటున ఒక వ్యక్తి రూ.1,623 ఖర్చు చేశారు. ఈ జాబితాలో మరో తెలుగు రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో మద్యం కోసం ఒక వ్యక్తి సగటున రూ.1,306 ఖర్చు చేశారు. పంజాబ్‌లో రూ.1,245 ఖర్చు పెట్టగా, ఛత్తీస్ గఢ్‌లో ఒక్కో వ్యక్తి మద్యంపై రూ.1,227 ఖర్చవుతుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in