86
దీపావళి పండుగ రోజున గుడివాడ – పామర్రు రోడ్లు కొండాయపాలెం వద్ద విషాదం చోటు చేసుకుంది. కొండాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలువలోకి దూసుకెళ్లగా.. కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారి లో ఒకరు విజయవాడ కు చెందిన చాలసాని శివరామకృష్ణ (48)కాగా మరొకరు దావులూరు కు చెందిన తుమల గోపాలకృష్ణ (50)గా గుర్తించారు. గుడివాడ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.