గడచిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రభుత్వం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పెన్షన్ అమలు చేసింది. తాజాగా కీలక హామీ అయిన మెగా డీఎస్సీ విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నవంబర్ ఆరో తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తంగా 16,347 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్‌లను విడుదల చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పోస్టుల జాబితా వివరాలను సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిఎస్‌సి నోటిఫికేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది. రెండో నవంబర్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు విడుదల చేసిన తర్వాత డీఎస్సీ దరఖాస్తు చేసుకున్న కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలుకాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మూడు నెలల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త టీచర్లకు శిక్షణ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే సమయానికి వారికి పాఠశాలలో బాధ్యతలు అప్పగించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కొత్త టీచర్లు వస్తే ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయ స్కూల్‌లో ఇబ్బందులను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల పాఠశాలల్లో ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి. ఒక టీచర్ సెలవు పెడితే ఆరోజు బడి మూసేయాల్సి వస్తోంది. డీఎస్సీలో చాలా పాఠశాలకు రెండో టీచర్ ను ఇచ్చే అవకాశం ఉంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత తీరే అవకాశం ఉంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం అందించింది అందుకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టింది అయితే కొత్తగా టెట్ రాసేవారికి అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరడంతో మూడు నెలలు వాయిదా వేసింది ఇటీవలే డీఎస్సీ విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష తుది కీ విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు. దీనిని పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించిన తరువాత తుది కీ విడుదల చేసారు. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేశారు అధికారులు.
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు, నూతన పాలక మండలి ఏర్పాటు
చర్లపల్లి రైల్వే స్టేషన్ | ఎయిర్‌పోర్టులను తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్