Home » నేడు ఏపీలో వ‌ర‌ద బాధితుల‌కు ప‌రిహారం చెల్లింపు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

నేడు ఏపీలో వ‌ర‌ద బాధితుల‌కు ప‌రిహారం చెల్లింపు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
నేడు ఏపీలో వ‌ర‌ద బాధితుల‌కు ప‌రిహారం చెల్లింపు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వ‌ర‌ద‌ల‌కు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయనున్నారు. ఈ పరిశీలన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన మీడియాకు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలు, బుడ‌మేరు వ‌ర‌ద‌ల‌కు విజ‌య‌వాలోని ప‌లు ప్రాంతాలు ముంపున‌కు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మునుపెన్నడూ లేని విధంగా విజయవాడ వరదలకు అతలాకుతలం అయింది.

ఈ 10 రోజుల పాటు విజయ’వాడ కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు మకాం వేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందేలా యంత్రాంగాన్ని నడిపించారు. బాధితులకు న‌ష్ట‌ప‌రిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎన్యుమ‌రేష‌న్ పూర్తి చేసింది. నష్టపరిహారం ప్యాకేజీని సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్యాకేజీ ప్రకారం వ‌ర‌ద‌ల్లో నష్టపోయిన బాధితుల‌కు ఈరోజు (బుధవారం) ముఖ్యమంత్రి పరిహారం విడుదల చేయనున్నారు. అర్హులైన బాధి తులందరికీ నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు జమ చేయనున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in