నిబంధనలకు విరుద్ధంగా కాజులూరు మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి మాఫియా కొనసాగుతోంది. గతవారం రోజు నుంచి మండలంలో పలుచోట్ల ఈ మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంత సంబంధిత శాఖ అధికారులు మౌనంగా ఉండటంపై మండలంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ట్రాక్టర్లతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎవరైనా సమాచారం ఇస్తే స్థానిక రెవెన్యూ సిబ్బంది తూ..తూ.. మంత్రంగా తనిఖీలు నిర్వహించి రహదారిపై యదేచ్ఛగా వెళుతున్న ట్రాక్టర్లు లకు నామమాత్రపు ఫైన్ విదించి చేతులు దులుపుకున్నారు. ఈమేరకు మండలం లో యదేచ్చగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలపై తహశీల్దార్ నీ వివరణ కోరగా.. తన దృష్టికి రాలేదని రహదారిపై ట్రాక్టర్లతో రవాణా అవుతుందన్న సమాచారంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఓ, లను పంపించామని మట్టితో వెళుతున్న ట్రాక్టర్లుకు ఫైన్ వేస్తున్నమన్నారు.
కాజులూరులో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు..
36