5
దద్దమ్మ పాలనలో తెలంగాణ రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దిక్కుమాలిన పాలనలో జీవితాలు దిక్కుమొక్కు లేకుండా పోయాయని విమర్శించారు. రాష్ట్రంలో వివిధ సమస్యలపై బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబసభ్యుల ధర్నాలు, రైతులు, గురుకుల టీచర్ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయా ధర్నాలకు సంబంధించిన ఆర్టికల్స్ స్క్రీన్‌షాట్స్‌ను పోస్టు చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.