23
గాలివీడు మండలం వెలిగిల్లు ప్రాజెక్టులోకి నీరు చేరడంతో వెలిగిల్లు ప్రాజెక్టు నీటితో జలకలాడుతోంది.
గత రెండు రోజులుగా వెలిగిల్లు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో ఆ ప్రాజెక్టులోకి నీరు వచ్చి సోమవారం నాటికి మూడు టీఎంసీ ల నీరు చేరిందని అధికారులు తెలిపారు. దీనితో ప్రాజెక్టు కింద సాగు చేసుకున్నటువంటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.