6
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నమ్మి జనం ఓటు వేసి ప్రజలు అధికారం ఇచ్చారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాంటి హమీలను అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వర్కౌట్స్ చేస్తోంది. వైసీపీ పోరాటాలకు సిద్దం అవ్వకముందే.. జనాలకు చేరువ అయ్యేందుకు సీఎం చంద్రబాబు మాష్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. నవంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.