76
పులివెందుల – ప్రొద్దుటూరు మార్గంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుకు వెనుక అద్దం పగిలిపోవడంతో ప్రయాణికులు వర్షపు చినుకులతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక బస్సు వెనుక వైపు అద్దం పగిలిపోవడంతో అక్కడ కూర్చొనేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైన ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు వెనుక భాగంలో పగిలిన అద్దాన్ని మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.