Home » మత్స్య శాఖ అధికారులపై పోచారం ఆగ్రహం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

మత్స్య శాఖ అధికారులపై పోచారం ఆగ్రహం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
మత్స్య శాఖ అధికారులపై పోచారం ఆగ్రహం - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • చేప పిల్లల సైజు తక్కువగా ఉండటంతో వెనక్కి పంపాలని ఆదేశం

బాన్సువాడ, ముద్ర: చేప పిల్లలు చిన్న సైజులో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మత్స్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే వాపసు చేయించారు, పెద్దసైజు చేప పిల్లలను తీసుకురావాలని సూచించారు. మంగళవారం ఆయన బాన్సువాడలోని కల్కీ చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కోట్ల రూపాయలలో చేప పిల్లలను కొనుగోలు చేస్తుండగా, చిన్న సైజు పిల్లలను కొనుగోలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇవివని, సగం చనిపోతాయని అన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 26వేల చెరువుల్లో 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేస్తోందని అన్నారు. తాను మత్స్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించామని, గొప్ప ఆలోచనతో చేసిన పథకం ఇదని, దీనికి పూర్తిగా కర్త, కర్మ, క్రియ తానేనని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ప్రారంభించామని అన్నారు. మధ్య దళారులు వచ్చి చేపలను తక్కువ ధరకు దోచుకుపోతున్నారని, గంగపుత్రులను మోసం చేశారని గ్రహించి తాను ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభించానని అన్నారు. చేప పిల్లల పంపిణీ ప్రారంభించి 8 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. మత్స్యకారుల చేపలను విక్రయించే ఆటో నిమిత్తం మోటర్ సైకిల్, తెప్పలు, వలలు, ఇచ్చామని అన్నారు. మంజీరా ద్వారా వచ్చిన నీరు ఉన్నందున చిన్న చేపలు వేయకుండా, పెద్ద చేపలు వేయాలని అన్నారు.

చేపలను మంచిగా కాపాడుకుంటే మత్స్యకారులు ఎంతో సంపాదించవచ్చన్నారు. ప్రకృతి సిద్ధంగా చేపలు పెరుగుతాయని, కష్టపడి చేపలు వేస్తున్నప్పుడు మీరు కూడా కష్టపడాలని అన్నారు. దళారులకు విక్రయించి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌బ్యాక్ మున్సిపల్ కలెక్టర్, చైర్మన్ గంగాధర్, అంజిరెడ్డి, ఎజాజ్, నార్ల సురేష్, నార్ల రవీందర్, జిల్లా మత్స్య శాఖ అధికారి నిర్వహించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in