Home » నేతన్నలకు దసరా కానుకగా యార్న్ డిపో ఇవ్వాలని – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

నేతన్నలకు దసరా కానుకగా యార్న్ డిపో ఇవ్వాలని – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
నేతన్నలకు దసరా కానుకగా యార్న్ డిపో ఇవ్వాలని - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • చేనేత కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
  • మాట మీద ఉండేది కాంగ్రెస్సే
  • గత బిఆర్ఎస్ పాలకులు నేత కార్మికులను మోసం చేశారు
  • యార్న్ డిపోతో వేలాదిమంది కార్మికులకు ప్రయోజనం..
  • కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :సిరిసిల్ల నేత కార్మికులు గత 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యార్న్ డిపో దసరా కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. వేములవాడలో యార్న్ డిపో అందించిన సిరిసిల్లలో వేలాది మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.సోమవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల నేత కార్మికుల 30 ఏళ్ల కల కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు సిరిసిల్లలో యార్ను డిపో ఏర్పాటు చేస్తామంటూ ప్రగల్బాలు పలికారని తెలిపారు.

మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురించి పట్టించుకోలేదు. యార్న్ డిపో చేయించుకోలేక పూర్తిగా వైఫల్యం చెందారని. గత బిఆర్ఎస్ పాలకులు నాయకులు కార్మికులను ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప వారు ఏనాడు పట్టించుకోలేదు.నేత కార్మికుల కష్టాలను చూసి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే విద్యుత్ బిల్లుల బకాయిని కూడా తీర్చారని అన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు 10 ఏళ్ల కాలంలో సాధించినది కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల్లోనే యార్ను డిపో చేసి నేత కార్మికుల కల నెరవేర్చిందని వివరించారు.

యార్ను డిపోను వేములవాడలో ఏర్పాటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, డిపో ఏర్పాటుకు తక్షణం 50 కోట్ల రూపాయలు కేటాయించిందని. వేలాది కార్మికులకు ఇబ్బందులు తప్పడం, ఉచితంగా యార్న్ లభించడంతోపాటు చేతినిండా పని దొరుకుతుందని తెలిపారు. గతంలో నాయకులు కార్మికులు ఇతర రాష్ట్రాలకు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందులు పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యార్న్ డిపో వెళ్లిందని చెప్పారు. యార్న్ డిపోతో బతుకమ్మ సంబరాలు, దసరా పండుగను నాయకులు కార్మికులు మరింత ఘనంగా వారి ఇళ్లలో వెలుగులు నిండేలా జరుపుకుంటారనిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ఇందుకోసమే బతుకమ్మ, దసరా పండుగను కార్మికులు వైభవంగా జరుపుకోవాలని ప్రభుత్వం యార్న్ డిపో అందించిందని తెలిపారు.

నేత కార్మికులకు టెస్కో ఆధ్వర్యంలో క్రెడిట్ పై యార్న్ ను ఇవ్వడంతో పాటు ఉత్పత్తి అయిన వస్త్రాన్ని సైతం టెస్కోనే కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ రంగంపై జీవిస్తున్న వేలాది మంది కార్మికులకు ఎంతో లాభం కలుగుతుందని వెలిచాల రాజేందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వేములవాడ కేంద్రంగా యార్న్ డిపో అందించిన ముఖ్యమంత్రి రాష్ట్ర రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలకు వెలిచాల రాజేందర్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in