Home » కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకం లబ్దిదారులకు చెక్కులను అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..

కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకం లబ్దిదారులకు చెక్కులను అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..

by v1meida1972@gmail.com
0 comment

కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకం క్రింది కొత్తగూడెం మున్సిపాలిటీ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి ఎంపికైన 66 మంది లబ్దిదారులకు రూ.66,07,656ల విలువగల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో అయన మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు వివాహాలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకం అమలులో సాంకేతిక లోపాలుంటే సరిచేసి త్వరితగతిన ఆర్థికచేయూత అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఛైర్ పర్సన్ కాపు సీతా తహశీల్దార్లు పుల్లయ్య, కృష్ణ, కమిషనర్ శేషాంజన్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in