తెలంగాణ డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులతో కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా.. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ఈ ఏడాది (2024) మార్చి నెలలోలో వెల్లడైంది. ఫలితాల విడుదల అనంతరం ఖాళీల సంఖ్య ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత.. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీల (డీఎస్సీ)కు రాష్ట్ర విద్యాశాఖ నుంచి లిస్ట్ వెళుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం పట్టవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు. మరికాసేపట్లో ఫలితాల లింక్ యాక్టివేట్ కానుంది. TG DSC 2024 Results చెక్ చేసుకోవడానికి డెరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
విడుదలైన తెలంగాణ డీఎస్సీ ఫలితాలు
44