ఆంధ్రప్రదేశ్
తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు వెల్లడి కావడంతో జోక్యం చేసుకోవాలని సత్యం సింగ్ అభ్యర్థించారు. ”టీటీడీ ట్రస్ట్ గత మేనేజ్‌మెంట్ హయాంలో మాంసాహార ఉత్పత్తులను ‘ప్రసాదం’ తయారీలో ఉపయోగించినట్లు ఇటీవలి పరిశీలనలో ఆందోళన కలిగించే నిజం బయటపడింది. ముఖ్యంగా పక్షి మాంసాన్ని (కోలిస్) వాడారు. ఈ చర్య హిందూ మతపరమైన ఆచారాలు, ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించడమే కాకుండా మత విశ్వాసాలపై దాడి చేసినట్టు అవుతుంది.
మాంసాహార ప్రసాదం తయారీలో ఉపయోగించడమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం రాజ్యాంగ పరిరక్షణపై దాడికి పాల్పడడమే. ఆర్టికల్ 25(1) ప్రకారం అందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది” అని న్యాయవాది సత్యం సింగ్ ప్రకటించారు.ప్రసాదం తయారీ, పంపిణీ హిందూమత ఆచరణలో అంతర్భాగమని పేర్కొన్నారు. హిందూ సంప్రదాయం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలో స్థిరపడిందని అన్నారు. పవిత్ర నైవేద్యాన్ని మాంసాహారంతో కలుషితం చేయడం భక్తుల హక్కులను నిర్వాహకులు తిరస్కరించినట్లు పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం మన పవిత్ర సంస్థల నిర్వహణను వేధిస్తున్న ఒక పెద్ద సమస్యను ఎత్తిచూపుతున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.