17
అన్ని భాషలు నేర్చుకో. కానీ నీ మాతృభాషను మాత్రం తప్పకుండా నేర్చుకోమని చెప్పిన కాళోజీ తెలుగు వారికి ఎన్నో విధాల ఆదర్శనీయుడు. కాళోజీ రంగారావు, రమాబాయమ్మల రెండవ కుమారుడైన ఆయన అసలు పేరు ‘రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామరాజ్. ’కర్ణాటక రాష్ట్రంలోని ‘రట్టహళ్లి’లో 9 సెప్టెంబర్ 1914న జన్మించారు. కాళోజీ ప్రాథమిక, ఉన్నత విద్యను వరంగల్‌లోని మడికొండలో, హైదరాబాద్‌లో పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్‌లో న్యాయ విద్యను అభ్యసించారు.