14
తెలంగాణలో వరద బాధితులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అండగా నిలిచారు. ఖమ్మం వరద ముంపు బాధితులకు తన వంతుగా ఆర్థిక సాయం అందించారు. సిఎం సహాయనిధికి తన నెల జీతం అందజేశారు. వరద ముంపు బాధితులకు తీన్మార్ మల్లన్న & టీం అండగా ఉంటుందని ఓ వీడియోలో తెలిపారు. అలాగే తీన్మార్ మల్లన్న టీమ్‌ని క్షేత్ర స్థాయిలో బాధితులకు అండగా నిలబడాలని కోరారు.