10
కేసీఆర్ కుటుంబం దగ్గర రూ.లక్ష కోట్లు ఉన్నాయని, CMRFకు రూ.2వేల కోట్లు నిధులివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిట్టా చాట్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విపత్తుపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. వరదల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని హెల్త్ మినిస్టర్ దామోదరను ఆదేశించినట్లు చెప్పారు. మిషన్ కాకతీయలో జరిగిన దోపిడీ వల్లే చెరువు కట్టలు తెగిపోయాయన్నారు.