55
సిపిఎస్. రద్దుచేసి ఓ పి ఎస్ ను వెంటనే అమలు చేయాలని కోరుతూ.. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ అమరనేని రామారావు, సెక్రటరీ జనరల్ సంగం వెంకట పుల్లయ్య హాజరయ్యారు. కొత్తగూడెం పాత బస్ డిపో నుండి బస్టాండ్ సెంటర్ లో గల అమర వీరుల స్తూపం వరకూ భారీ పాదయాత్ర ను నిర్వహించారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో జోరు వర్షం లోనూ మానవ హారం ఏర్పరచి ఉద్యోగుల ఆవేదనను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ భాగస్వామ్య పక్షాలైన అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.