5
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం షురూ అయింది. ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మొదటి రోజే 99 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా గత ప్రభుత్వ హయంలో ఇచ్చిన పెన్షన్ పై రూ.1,000 పెంచి రూ.4,000 అందిస్తోంది చంద్రబాబు సర్కార్.
కాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.