నారాయణఖేడ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కామం తో కళ్ళు మూసుకుపోయిన ఓ ముస్లిం వ్యక్తి.. మతిస్థిమితం లేని ఎస్సీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో జరిగింది. నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి మతిస్థిమితం లేని దళిత మహిళపై మోయిన్ అనే వ్యక్తి నడిరోడ్డులో అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని మహిళ ఈనెల 26 వ తేదీ సోమవారం రాత్రి రోడ్డు ప్రక్కన నిద్రిస్తుండగా మోయిన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సి.సి కెమెరా పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని మోయిన్ గా గుర్తించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో ఆడవారి పై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
నారాయణఖేడ్ లో దారుణం.. మద్యం మత్తులో మతిస్థిమితం లేని ఎస్సీ మహిళపై అత్యాచారం
47
previous post