Home » వైసిపి చేజారునున్న రాజ్యసభ ఎంపీలు.. పార్టీకి రాజీనామా చేయనున్న మోపిదేవి వెంకటరమణ – Sravya News

వైసిపి చేజారునున్న రాజ్యసభ ఎంపీలు.. పార్టీకి రాజీనామా చేయనున్న మోపిదేవి వెంకటరమణ – Sravya News

by Sravya News
0 comment
వైసిపి చేజారునున్న రాజ్యసభ ఎంపీలు.. పార్టీకి రాజీనామా చేయనున్న మోపిదేవి వెంకటరమణ


సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. 11 స్థానాలకు మాత్రమే వైసిపి పరిమితమైంది. దీంతో వైసీపీలోని కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న శాసనమండలి, రాజ్యసభలోనూ ఆ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎంపికనే ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు టిడిపి, అటు బిజెపి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగానే వైయస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా భావించే మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. మోపిదేవికి రాజీనామా చేసిన నిర్ణయం తీసుకున్నట్లు. గురువారం ఆయన పార్టీ సభ్యత్వంతోపాటు రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేయబోతున్నట్లు చెబుతున్నారు. రాజీనామా అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన సమాచారం. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లాకు చెందిన మంత్రితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈయన దారిలోనే మరో రాజ్యసభ ఎంపీ మస్తాన్ రావు కూడా పయనించడాన్ని గుర్తించారు. ఆయనతో టిడిపి ముఖ్య సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. మిగిలిన రాజ్యసభ సభ్యులు కూడా ఊగిసలాటలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బలం ఉండటం వల్లే వైసీపీ బిజెపి జగన్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత, సిఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ బలాన్ని తగ్గించడం జగన్మోహన్ రెడ్డి ధర్యాన్ని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు ఇష్టపడినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలపై గాలం వేసినట్లు తెలుస్తోంది. మరో నలుగురు రాజ్యసభ ఎంపీలు కూడా టిడిపి ముఖ్య నాయకులతో టచ్ లో ఉన్నారు. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిన వైసీపీ ముఖ్య నాయకులు రాజ్యసభ ఎంపీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవైపు రాజ్యసభ ఎంపీలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న టీడీపీ, శాసనమండలిలో బలంగా ఉన్న వైసీపీని బలహీనపరిచేందుకు ఎత్తులు వేస్తోంది. ఈ టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంపికనే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసిపికి రాజీనామా చేయడంతోపాటు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. ఈమె టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు. ఈమెతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయని మరో సమాచారం.

నివారణకు జగన్ ఏం చేస్తారన్న ఆసక్తి..

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒడుదుడుకులను ఎదుర్కొంటోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీని ఇప్పటికే వీడగా, తాజాగా రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడేందుకు సిద్ధపడడం ఆయనను కలవడానికి గురి చేస్తోంది. ఈ నష్ట నివారణ చర్యలకు ఆయన సిద్ధమవుతున్నారు. పార్టీ మారే ఆలోచనలో ఉన్నవారితో సంప్రదింపులు జరపాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి నాయకులను పురమాయించినట్లు తెలుస్తోంది. వారంతా ఎంపీలతో సంప్రదింపులు జరిపి పార్టీలో ఉండేలా ఒప్పుకోవడానికి ప్రయత్నించారు. వైసిపిలోనే ఉంటే ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో చాలామంది పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు. పార్టీ నాయకత్వం సంప్రదింపులకు మనసు మార్చుకొని పార్టీలో ఉండేందుకు ఎంతమంది ఆసక్తి చూపిస్తారనేది చూడాల్సి ఉంది.

Motorola Edge 50 Ultra 5G: బంపర్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా 5జీపై ఏకంగా రూ. 10వేలు తగ్గింపు
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in