ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గడచిన కొన్నాళ్లుగా వాలంటీర్లుపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. వైసిపి ప్రభుత్వంలో నియమితులైన ఎంతో మంది వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజీనామా చేశారు. ఇప్పటికీ అనేక మంది వాలంటీర్లు కొనసాగుతున్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10,000 గౌరవ వేతనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయా వాలంటీర్లంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజీనామా చేయకుండా కొనసాగుతున్న నేపథ్యంలో తమను కొనసాగిస్తారన్న భావనలో వాలంటీర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాలంటీర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయని వారంతా నిరుత్సాహంలో ఉన్నారు. తాజాగా వాలంటీర్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంపై ఎట్టకేలకు సర్కారు క్లారిటీ ఇచ్చింది. వలంటీర్లను వదుకునేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వాలంటీర్లకు బకాయి ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
వాలంటీర్లకు రెట్టింపు కానున్న గౌరవ వేతనం..
వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా హామీ ఇవ్వడంతోపాటు పెండింగ్ వేతనాలను చెల్లిస్తామని ప్రకటించారు. దీంతో వాలంటీర్లకు వేతనాలు రెట్టింపు కానున్నాయి. గత వైసిపి ప్రభుత్వం వాలంటీర్లకు గౌరవ వేతనంగా రూ.5000 ఇస్తుంది. కూటమి ప్రభుత్వం రూ.10,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే సీఎం హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉండటంతో వాలంటీర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెంచడంతోపాటు వాలంటీర్లకు అదనపు విధులను అప్పగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని మాత్రమే వాలంటీర్ ద్వారా వినియోగించుకుంది. ప్రభుత్వం మాత్రం వీరికి విధులను అప్పగించేందుకు సిద్ధపడుతోంది. వాలంటీర్లుగా ఉన్న తమపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం పట్ల ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారికి అనుకూలంగా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఏపీలో రెండు నెలల నుంచి వాలంటీర్లకు వేతనం చెల్లించడం లేదని, ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక నివేదిక పంపినట్లు గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం.శివప్రసాద్ అందజేశారు. దీనితో వలంటీర్ల సమస్య పరిష్కారం అయినట్టేనని. ఎన్నికల సమయంలో లక్ష మంది వలంటీర్లు తమ తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వారి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అప్పట్లో వైసీపీ నాయకుల మాటలు విని పొరపాటు చేశామని, మంత్రులకు, అధికారులకు, కలెక్టర్లకు అప్పట్లో రాజీనామా చేసిన వలంటీర్లు పెద్ద ఎత్తున వినతులు ఇచ్చారు. దీంతో తమతో రాజీనామాలు చేయించిన వారిపై కేసులు పెట్టాల ని ప లువురు మంత్రులను కలిసి వివరించారు.
బెంగాల్ లో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల ఆందోళన.. సీఎం మమత రాజీనామా చేయాలని డిమాండ్
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్