24
MLC కవిత బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘బాధ్యతాయుతమైన హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి సుప్రీంకోర్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించాలి. ఈయనపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతున్నా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.