- ఇన్నోవేటివ్ క్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ …
ముద్ర, శేరిలింగంపల్లి: విద్యార్థులకు తరగతి గదుల్లోనే శాస్త్రీయ విద్యను పెంపొందించి 21వ శతాబ్దంలో ప్రతి విద్యార్థికి అవకాశం కల్పించడం ద్వారా వారికి తెలిసేటట్లు చేయడమే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తుంది ” ఇన్నోవేటివ్ క్లాస్స్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నామాల బాల వెంకట సుబ్బా రావు తెలిపారు. సంస్థ నూతన ఆఫీసును మనికొండలోని,హరివిల్లు రోడ్డులో, కాకతీయ క్రయిస్తా భవనంలో ఉంది. ప్రముఖ సామాజిక సేవకులు గూడూరు సత్యనారాయణ, వెబ్ సైట్ ను సుమన్ టీవీ బిజినెస్ సీఈఓ నాగరాజ్, బ్రోచర్ ను ‘ముద్ర’ దిన పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ కొణిజేటి సత్యనారాయణ.
వినూత్న రీతిలో శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానంలో ఒక ప్రక్క విద్యార్థులకు,మరో పక్క ఉపాధ్యాయులకు , తల్లితండ్రులకు శిక్షణ ఇస్తూ “వికసిత భారత్” లక్ష్య సాధనకు వివిధ కోర్సులను ప్రారంభించినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నామాల బాలవెంకట సుబ్బారావు వివరించారు. తమ సంస్థ సర్వీసెస్‌లో భాగంగా ముందు 6-10 వ తరగతి విద్యార్థుల ఆఫ్టర్ స్కూల్ కేర్‌ని వారి కాంప్లెక్స్‌లలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.7-12 వ తరగతి విద్యార్థుల శాస్త్రీయ కెరీర్ గైడెన్స్ ,పోటీ పరీక్షలలో ఉన్నతికి జీ/నీట్ మెంటోర్‌షిప్… ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ సెషన్స్ , తల్లితండ్రులకు పేరెంటల్ సెషన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ అనేక మంది తల్లితండ్రులు, ఉపాధ్యాయులు.