సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పని చేస్తూ మెడికల్ ఇఎన్వాలిడేట్/ మరణించిన కార్మికుల అర్హత కలిగిన డిపెండెంట్లకు కారుణ్య నియామకాల కొరకు ధరఖాస్తు చేసుకున్న కార్మికుల పిల్లలకు కొత్తగూడెం ఏరియా జిఎంఎం.షాలేం రాజు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిఎం సంస్ధ సి&ఎండి ఆదేశాల మేరకు 2018 సం. నుండి కారుణ్య నియామకాలను జరుగుతున్నాయి. ప్రస్తుత నెలలో “15” మందికి కారుణ్య నియామకాల పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇచ్చిన ఈ అవకాశాన్ని శ్రద్ధగా క్రమశిక్షణతో నాగాలు లేకుండా పని చేసి సంస్థ అభివృద్దికి పాటుపడాలని రానున్న కాలంలో విద్యార్థులు తగిన స్థాయిలో ఉద్యోగాలను పొందాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు కొత్తగూడెం ఏరియాలో 599 మందికి కారుణ్య నియామక పత్రాలు అందచేశామని, వారు కంపనిలో బదిలీ వర్కర్ లాగ నియమకాము అయి కంపనీ నిర్వహించిన అంతర్గత పరీక్షలలో అర్హత సాధించిన వారు ప్రమోషన్ పొంది వివిధ పోస్టులలో పని చేస్తున్నాన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం జి.వి.కోటిరెడ్డి, సీనియర్ పిఓఎం. మురళి, ఏఐటియుసి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ కొత్తగూడెం ఏరియా జె.గట్టయ్య, జూనియర్ అసిస్టెంట్ కే.అరవింద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మెడికల్ ఇఎన్వాలిడేషన్/ మరణించిన కార్మికుల వారసులకు కారుణ్య నియామక పత్రాల అందజేత
19