ఐడిఓసిలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, రైతులు, యువకులు, పాత్రికేయలు, నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దీనిలో భాగంగానే నూతన రెవెన్యూ చట్టం 20 24 ముసాయిదా బిల్లు రూపొందించిందని కలెక్టర్ తెలిపారు. నూతన చట్టం రూపకల్పనలో రైతులను, ప్రజలను మేధావులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వర్క్ షాప్ లో నిర్వహించాలని ఆదేశించిందని కలెక్టర్ అన్నారు. బిల్లు అంశాలు, రైతుల భూ రికార్డులు పకడ్బందీగా ఉండాలని ఉద్దేశంతో ముసాయిదా బిల్లుపై మేధావులు విద్యావేత్తలు, రెవెన్యూ అధికారులు, రిటైర్డ్ అధికారులు, భద్రాద్రి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు, రైతులు, రైతు సంఘం నాయకులు, తమ సూచనలు అందజేయాలని కలెక్టర్ కోరారు. రైతులు మాట్లాడుతూ చట్ట మార్పు చేసేటప్పుడు భూ సర్వే నిర్వహించాలని, భూమిపై ఉన్న రైతులు మాత్రమే నమోదు చేయాలని తెలిపారు. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, పాత చట్టాలను మార్చి, కొత్త చట్టాలలో ప్రతి సంవత్సరం పహానీలలో నమోదు ఉండాలని, శిస్తు వసూలు మళ్లీ పెట్టాలని, ఆర్వోఆర్ ను సవరించాలని, పొజిషన్ కాలం ఉండాలని కబ్జా ఉన్న రైతులకే పట్టా ఇవ్వాలని, ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కొత్త చట్టం గురించి తెలపాలన్నారు. గ్రామాల వారిగా ఉన్న సర్వే నెంబర్లలో భూమి ఎక్కువగా ఉంటుందని సరిచేయాలని, భూమి అమ్మిన వారి పేర్లను తొలగించాలని, ధరణి పోర్టల్ వల్ల రైతులకు చాలా నష్టం జరిగిందని దాన్ని తీసేయాలన్నారు. ఈ చట్టం ద్వారా గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదని, భూములను మ్యాపింగ్ చేయాలని, రైతుబంధు తీసుకుంటున్న రైతుల భూములను పరిశీలించాలన్నారు. ఆధార్ నమోదు తో పాటు మరేదైనా కార్డు తప్పకుండా తీసుకోవాలని, కొత్త చట్టంలో అప్పిల్ ఉండాలని, పొజిషన్ కాలం కూడా ఉండాలని, ప్రభుత్వం చట్టంపై రైతుల అభిప్రాయాలు తీసుకొని చట్టం చేయడం చాలా సంతోషంగా ఉందని, సాదా బైనామా చేసే అధికారం డివిజన్ అధికారులకు ఇవ్వాలని, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ లో సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగిని నియమించాలని సూచించారు. ఈ సమావేశానికి రానివారు, నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ror2024- rev@telangana.gov.in వెబ్ సైట్ లో అప్లోడ్ చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు మధు, దామోదర్ బార్ అసోసియేషన్ సభ్యులు సోమేశ్, తాసీల్దార్లు, న్యాయవాదులు, రెవెన్యూ సిబ్బంది, అరిటైర్డ్ అధికారులు, రైతు సంఘం నాయకులు, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ORR చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు అందజేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశం
42