ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింప చేయాలని కొత్తగూడెం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం పట్టణంలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వనమా మాట్లాడుతూ.. ఎంతోమంది అమరుల త్యాగఫలమే సాధించుకున్న తెలంగాణలో సరైన సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందికే రుణమాఫీ చేసి మరి కొంత మందికి రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని మండిపడ్డారు. కావున అందరికీ షరతులు లేకుండా రుణమాఫి చేయలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, కొత్తగూడెం ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ తదితరులు పాల్గొన్నారు
ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింప చేయండి : కొత్తగూడెం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు
10