Home » పిల్లలు చదివే పాఠశాలనా? లేక కిరాణా వస్తువులు అమ్ముకునే దుకాణ సముదాయమా?

పిల్లలు చదివే పాఠశాలనా? లేక కిరాణా వస్తువులు అమ్ముకునే దుకాణ సముదాయమా?

by v1meida1972@gmail.com
0 comment

తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం మాచర్ల గ్రామం ఈ గ్రామ పరిధిలో బల్గర వెళ్లే మార్గంలో ” గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ” కారస్పాడెంట్. రమేష్ ఈ స్కూల్ ఆరు సంవత్సరాల నుండి స్కూల్ నడపటం జరుగుతుంది ఈ స్కూల్ విద్యహక్కు చట్టం నకు వెతిరేకంగా ఈ నడుపబడుచున్నది ఈ స్కూల్ లోనే దుకాణం నడపటం జరుగుతుంది అలాగే ప్రతి క్లాస్ రూమ్ లు ఇరుకు గదులు కలిగి విద్యార్థులను కుచ్చి కుచ్చి ఇరుకుగా అధిక సంఖ్యలో కూర్చోబెట్టడం జరుగుతుంది. మరుగుదొడ్లు లేక ఇబ్బందులు ఉన్న రెండు మూత్రశాలలో యవ్వన ఆడపిల్లలు మగపిల్లలు కలిసి మూత్రవిసర్జనకు వెళ్ళవలసిన పరిస్థితి జరుగుతుంది అలాగే “ప్లే ” గ్రౌండ్ అనేది లేదు ఇంకా ఎన్నో సమస్యలతో స్కూల్ నడుపబడుతూ ఉంది వ్యాపారదుకాణసముదాయ పరిసరాల మధ్య స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్కూల్ యాజమాన్యం రమేష్ పాత్రికేయులకు ఫోన్ కాల్ రికార్డింగ్ లో పెట్టి ఫోన్ మాట్లాడటం జరుగుతుంది ఇలా తప్పుడు సమస్యల ఇరకాటంలో పెట్టడానికి విద్యా అధికారులు ఇలాంటి సమస్యలతో ఉన్న పాఠశాలలను చూసి చూడనట్టు తమాషా చూస్తున్నారు ఎలాంటి చట్ట పరమైన చర్యలు తీసుకోకుండా ఉంటున్నారని ప్రజలు మాట్లాడుతున్నారు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in