జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండలం రేకులపల్లి (జూరాల డ్యామ్ ) గ్రామం ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నందున జూరాల డ్యామ్ కు వరద నీరు వస్తుండంతో డ్యామ్ కు జలకళ వచ్చింది. డ్యామ్ కు భారీగా వరద నీళ్లు రావడం తో డ్యామ్ అధికారులు 32 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదిలారు. మొత్తం అవుట్ ఫ్లో. 1.38.606 క్యూసెక్కులు గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నది ఒడ్డు తీర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించారు.