సిక్కింలో భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సిక్కింలోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) తీస్తా స్టేజ్ 5 డ్యామ్‌లోని పవర్ స్టేషన్‌పై భారీ కొండచరియలు పడి ధ్వంసమైంది. గత కొన్ని వారాలుగా తరచుగా చిన్నపాటి రాళ్లు జారిపోతుండడంతో ముప్పు పొంచి ఉందని ముందే అధికారులు గ్రహించారు. మంగళవారం ఉదయం కొండ ప్రధాన భాగం జారిపడడంతో విద్యుత్ కేంద్రం శిథిలాలతో ధ్వంసమైంది. ప్రస్తుతం ఇక్కడ పవర్ ఉత్పత్తి జరగడం లేదు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కొండచరియలు విరిగిపడడంతో ముందుగానే సమీప ప్రాంత వాసులను ఖాళీ చేయించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో పని చేస్తున్న కార్మికులు మొబైల్లో చిత్రీకరించగా సోషల్ మీడియా లో వీడియో వైరల్ గా మారింది. సిక్కింలో ఉన్న అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.
సిక్కింలో భారీ ప్రమాదం.. పవర్ స్టేషన్‌పై పడ్డ కొండచరియలు
5