23
డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. శుక్రవారం ఆర్ వి కర్ణన్ కలెక్టర్ కాన్ఫిరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి అధికారులతో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ నియంత్రణ, వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలోని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. డెంగ్యూ నియంత్రణపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రై డే కార్యక్రమాల వల్ల దోమలను అరికట్టవచ్చన్నారు. పరీక్షలు పెంచాలని, పాజిటివ్ వస్తే సంబంధీకులు చుట్టు పక్కల నమూనాలు సేకరించడం ద్వారా నియంత్రణ చర్యలు చేపట్టడం సులువవుతుందన్నారు.