Home » వైసీపీకి బైబై చెబుతున్న సీనియర్ నేతలు.. నష్ట నివారణకు పూనుకునేనా.! – Sravya News

వైసీపీకి బైబై చెబుతున్న సీనియర్ నేతలు.. నష్ట నివారణకు పూనుకునేనా.! – Sravya News

by Sravya News
0 comment
వైసీపీకి బైబై చెబుతున్న సీనియర్ నేతలు.. నష్ట నివారణకు పూనుకునేనా.!


గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోవడంతో కార్యకర్తలు ఢీలాపడ్డారు. వైసిపి నాయకులు కూడా అంతర్మధనం చేస్తున్నారు. పార్టీ పరిస్థితి ప్రస్తుతం చాలామంది నాయకులు పార్టీని బయటికి వెళ్లిపోతున్నారు. 11 స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశం ఉండదని ఎంతో మంది నాయకులు రాజీనామా బాటపడుతున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కూడా అనేక మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీని విడిచిపెట్టారు. అయితే గడిచిన కొన్నాళ్లుగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ వస్తున్న నేతలు కూడా ఇప్పుడు పార్టీని వీడుుతుండడం ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరుగాంచిన ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేయడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

పార్టీకి బలంగా ఉంటాడు అనుకున్న నేత రాజీనామా చేయడంతో ఆ పార్టీ కేడర్ కూడా ఆందోళన చెందుతోంది. అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు కూడా తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరి కొందరు నేతలు చెబుతున్నారు. వీరంతా ఇప్పుడు రాజీనామా చేయడం గనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇదే బాటలో ఉత్తరాంధ్రకు చెందిన కొందరు నాయకులు కనిపిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించారు. ఇదే పార్టీకి చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. విశాఖపట్నం ఎమ్మెల్సీ వ్యవహారం ఆ పార్టీలో రగడకు కారణమవుతుంది. ఇద్దరు ముగ్గురు నేతలు పార్టీ మారే అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ. ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యులతో ఆసన్నమైందని నాయకులు ఎదురుచూస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్న నాయకులు ఇతర పార్టీలో చేరనప్పటికీ.. పార్టీకి రాజీనామా చేయడం కొంత ఇబ్బందిగా మారుతోంది. నాయకులు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునేందుకు కూటమి ప్రయత్నాలను చేస్తున్నారు. అదే జరిగితే వైసిపి మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. ఎల్లుండి జగిత్యాల బంద్‌కు హిందూ ఐక్య వేదిక పిలుపు
బంగారం కొనడానికి వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు..!

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in