16
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద హోంమంత్రి వంగలపూడి అనితకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే… విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అలంపురం వెళ్తుండగా బైకును తప్పించేందుకు మంత్రి ఎస్కార్ట్ వాహనం బ్రేక్ వేసింది. ఎస్కార్ట్ వాహనాన్ని వెనక నుంచి అనిత కారు ఢీకొట్టింది. మంత్రికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. హోంమంత్రి మరో వాహనంలో అలంపురం వెళ్లారు. మంత్రి అనిత కారు, ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి.