21
ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వ్యవసాయ, ఉద్యాన మల్బరీ పంటలను రైతులు తమ రైతు సేవా కేంద్రాల్లో నమోదు తప్పక చేయించుకోవాలని బుధవారం ఏఓ నవ్వాను సూచించారు. చక్రాయపేట మండలం మారెళ్లమడక గ్రామ పరిధిలో విఎఎ అంజలి వరిపంట నమోదు చేస్తున్న ప్రక్రియను ఆయన పరిశీలించారు. వరి పంటలో కాలిబాటలు తీసుకుంటే కలిగే ఉపయోగాలను, వరినారు కొనలు తుంచి నాటడం వల్ల కాండం కత్తిరించే పురుగును నివారించవచ్చునని వివరించారు.