20
పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లిలో ఏర్పాటు చేయబోయే సైనిక పాఠశాలకు విస్తృత స్థాయిలో నిధులు కేటాయింపు చేయాలని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేను కోరినట్లు బుధవారం ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. నిధులు కేటాయింపు చేసి త్వరలోనే భవనాలు కూడా పూర్తి చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు వెల్లడించారు.