52
జమ్మలమడుగు పట్టణంలోని దిగువపట్న కాలనీకి చెందిన వెంకటనారాయణ, కిరణ్లు ఇసుక తరలిస్తుండగా పోలీసులు ట్రాక్టర్లను జప్తు చేశారు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చింది నువ్వంటే.. నువ్వంటూ ఇద్దరు గొడవపడి పట్టణ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో వెంకటనారాయణపై కోపంతో కిరణ్ గొడ్డలితో తలపై దాడి చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.