20
ఒంటెల అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే :- అన్నమయ్య జిల్లాలో ఒంటెల వ్యాపారం కలకల రేపుతుంది.స్థానికులు సంబేపల్లి పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం రాయచోటి సమీపంలో ఉన్న ఒక గుట్టలో ఒంటెలను బేరసారాలు ఆడుతుండడంతో 16 ఒంటెలను రక్షించి, రాజస్థాన్ కు సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గుంటలను తెచ్చి రాయచోటి,మదనపల్లి,పీలేరు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కోవలోనే రాయచోటికి చెందిన ఒక బడా వ్యాపారవేత్త విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.