Home » ఏపీలో రాజకీయ సమీకరణలు మారనున్నాయా..? జగన్‌వైపు సోనియా చూపు – Sravya News

ఏపీలో రాజకీయ సమీకరణలు మారనున్నాయా..? జగన్‌వైపు సోనియా చూపు – Sravya News

by Sravya News
0 comment
 ఏపీలో రాజకీయ సమీకరణలు మారనున్నాయా..?  జగన్‌వైపు సోనియా చూపు


జాతీయ స్థాయిలో క్రమంగా బలపడుతున్న కాంగ్రెస్‌ పార్టీ 2029 ఎన్నికల నాటికి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 2014లో అధికారం కోల్పోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పూర్తిగా బలహీనపడింది. ఆ పార్టీ 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే, అనూహ్యంగా 2024లో జరిగిన ఎన్నికల్లో పుంజుకుని భారీ స్థానాలను దక్కించుకుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో బలహీన స్థితిలో ఉంది. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఒకటి. ఇక్కడ గడిచిన మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. రాష్ట్రంలో పార్టీని కనీస స్థాయిలో నిలబెట్టే నాయకుడు లేకుండా పోయారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన రాజారెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల మెల్లగా పార్టీలో చేర్చుకుని, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర నాయకత్వం చేసింది. మొన్న జరిగిన ఎన్నికల్లో షర్మిల పోటీని కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలు అయినా దక్కించుకుంటుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే, ఒక్కటి కూడా ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది. స్థానాలు సంగతి పక్కన పెడితే ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేదు. రెండు శాతం కూడా ఓట్లను ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది.

ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పునరాలోచనలో పడేలా చేసింది. 2029 నాటికి అధికారంలోకి రావాలంటే దక్షిణ భారతదేశంలో 25 ఎంపీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కనీసం పది స్థానాలు అయినా యూపీఏ కూటమికి చేరాలి. అప్పుడే అధికారానికి దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ లెక్కలన్నీ వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం వైసీపీ అధినేత జగన్ వైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. జగన్‌ను కాంగ్రెస్‌తో కలిసి పయనించేలా చేయడం లేదా, వీలైతే పార్టీని విలీనం చేయడం ద్వారా గానీ రానున్న ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్న భావనను కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే సోనియా కూడా సానుకూలతను వ్యక్తం చేసినట్లు గాంధీ తెలిపారు. అన్నీ కుదిరితే ఇరు పార్టీలకు చెందిన కీలక నాయకుల మధ్య కొద్దిరోజుల్లో చర్చలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణలు నేపథ్యంలో జగన్‌ కూడా కేంద్ర స్థాయిలో బలమైన కూటమి వైపు వెళ్లడం మంచిదన్న భావన ఆ పార్టీ ముఖ్య నాయకులలోనూ వ్యక్తమవుతోంది. అధికారంలో బీజేపీతో రాష్ట్రంలో తాము పోరాటాన్ని సాగిస్తున్న టీడీపీ కలిసి వెళ్తున్నందున ప్రత్యామ్నాయ కూటమి అయినా ఇండియా కూటమిలో చేరడం వల్ల ఫలితం ఉంటుందన్నది వైసీపీకి చెందిన ముఖ్య నాయకుల ఉవాచ. చూడాలి మరి రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు ఎలా మారనున్నాయో.

అక్కలను నమ్మొద్దు అన్న రేవంత్ రెడ్డి.. తననే అన్నారన్న సబిత.. తెలంగాణ అసెంబ్లీలో చెలరేగిన దుమారం
ఒలింపిక్స్ బ్రాంజ్ బ్యూటీ.. ఎవరీ మను భాకర్

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in