Home » ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో నలుగురు పేర్లు.! – Sravya News

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో నలుగురు పేర్లు.! – Sravya News

by Sravya Team
0 comment
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో నలుగురు పేర్లు.!


భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి స్థానంలో మరొకరికి బాధ్యతలను అప్పగించేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం సమాయత్తమవుతోంది. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చాలని బిజెపి నిర్ణయించింది. ఇందులో ఏపీ కూడా చూపిస్తుంది. ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా గడిచిన కొన్నాళ్ల నుంచి దగ్గుపాటి పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె రాజమండ్రి ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరొకరికి ఈ బాధ్యతలను అప్పగించాలని పార్టీ నిర్ణయించినట్లు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆశహులైన వారి నుంచి నలుగురు పేర్లు షార్ట్ లిస్ట్ చేసిన బిజెపి అధిష్టానం.. వారిలో ఎవరికో ఒకరికి ఈ బాధ్యతలను కట్టబెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలని మార్చాలని భావించిన అగ్రనాయకత్వం అందుకు అనుగుణంగా పార్టీ నేతలు అభిప్రాయాలను సేకరించారు. సామాజిక వర్గ సమీకరణలను వడపోసిన తరువాత నలుగురు పేర్లను ఫైనల్ గా చూపారు. ఈ నలుగురిలో ఇద్దరు సీనియర్లు సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి కాగా, మరో ఇద్దరు యువనేతలు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గుర్తించారు. వీరిలో ఎవరికో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు దక్కే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక కోసం బిజెపి అధిష్టానం అనేక అంశాలు పరిగణలోకి తీసుకున్నట్లు ఉన్నాయి. సామాజిక సమీకరణలు, అనుభవం, పార్టీ విధేయత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అధ్యక్షుడిని ఖరారు చేయనున్నారు. సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు ఇతర పార్టీలో పని చేసి వచ్చారు. వీరికి బిజెపితో బలమైన సంబంధాలు పెద్దగా లేవు. అదే సమయంలో వీరికి బాధ్యత అప్పగించినా పార్టీ క్యాడర్ ను ఎంత వరకు కలుపుకుంటూ వెళ్తారు అన్న ప్రశ్న కూడా మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే వీరికి కొంత వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. కాబట్టి వీరు పూర్తిగా పార్టీకి సమయానికేటాయించే అవకాశం కూడా ఉండదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న బిజెపి అగ్ర నాయకత్వం పార్టీకి పూర్తి స్థాయిలో సమయానికి కేటాయించే వారికి బాధ్యతలను అప్పగించే ప్రయత్నం చేయవచ్చని చెబుతున్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ పేర్లను సూచిస్తున్నట్లు చూపిస్తున్నారు. వీరిద్దరి విషయంలో కూడా పెద్దగా ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేదని తెలుస్తోంది. వీరిద్దరూ తొలి నుంచి బిజెపితోనే ఉన్నారు. బిజెపితోనే పెరుగుతూ వచ్చారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతోపాటు రాజకీయాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలను కూడా ఈ ఇద్దరు నేతలు నెరుపుతున్నారు. ఇద్దరికీ వేరే వ్యాపకాలు కూడా లేవు. పూర్తిస్థాయి సమయాన్ని పార్టీ కోసం కేటాయించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ నేతల పేరును పార్టీ అగ్ర నాయకత్వం గట్టిగానే చూస్తున్నట్లు కనిపిస్తున్నాయి. వీటితోపాటు గడిచిన కొన్నాళ్లుగా బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకొని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సామాజిక సమీకరణలను చూస్తున్న బిజెపి అధినాయకత్వం కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టే ఛాన్స్ ఉంది. మరి బిజెపి అగ్రనాయకత్వం ఈ నలుగురిలో ఎవరికి రాష్ట్ర బాధ్యతలను అప్పగిస్తుందో చూడాలి. ఏడాది నాటికి కొత్త అధ్యక్షుడితో బిజెపి సిద్దమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా వయనాడ్ గడ్డ.. భారీ మెజారిటీతో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ
పరగడుపున ఈ పండ్లను అస్సలు తినొద్దు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in