52
లింగంపల్లి గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలను తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులతో హాస్టల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అన్న మాకు సరియైన ఆహారం పెట్టట్లేదనీ పురుగులు, రాళ్లు వస్తున్నాయనీ విద్యార్థులు తెలిపారు. దీనిపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వారి దృష్టికి తీసుకెళ్తానని.. వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని రమేష్ యాదవ్ కోరారు. లింగంపల్లి హాస్టల్ ప్రిన్సిపాల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.