67
కుమార్తె చేతులపై తల్లి వాతలు పెట్టిన ఘటన రావులకోలనులో చోటు చేసుకుంది. రావులకోలనులో ఉన్న దంపతుల మధ్య విభేదాలు నెలకొనడంతో వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో వీరి కుమార్తె (14) తల్లి సంరక్షణలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఫోనులో తండ్రికి కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంది. ఈ విషయం తల్లికి తెలియడంతో కుమార్తె చేతులపై వాతలు పెట్టింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం పులివెందులకు తరలించారు. విషయం తెలుసుకున్న తండ్రి కూతురితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.