గోదావరి నది వరదలు మూలంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12 మండలాలలో 47 ఆవాసాలు ముంపు బారిన పడినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. వరద ప్రభావంతో 21,492 కుటుంబాలు ముంపు బారిన పడ్డాయని ముంపు తరలింపు సహాయ కార్యక్రమాలు నిమిత్తం 75 బోట్లను వినియోగించడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ముంపు బాధితుల సంరక్షణ కొరకు ఒక జాతీయ విపత్తు స్పందన బృందం సహాయక చర్యలు లో నిమగ్నమై ఉందని తెలిపారు. అల్లవరం మండలం బోడసకుర్రు, ముమ్మిడివరం మండలం ఠానే లంక గ్రామాలలో పునరావస్ కేంద్రాలు ముంపు బాధితుల కొరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముంపు బాధిత లంక గ్రామాలలో 60 వైద్య శిబిరాలు నిర్వ హించి ముంపు బాధితులు ఆరోగ్య భద్రత చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 కేజీల బియ్యం లీటర్ పామ్ ఆయిల్, కిలో కందిపప్పు కిలో ఉల్లిపాయలు కిలో బంగాళదుంప లను గుర్తించిన 16,182 కుటుంబాలలో 15,592 కుటుంబాలకు అందించడం జరిగిందన్నారు. వరద నీరు ఇంటిలో చేరిన కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక సహాయంగా ప్రకటించిన 3000 రూపా యలు అందించేందుకు 327 కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు.