ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్టలో జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తులు న్యాయమూర్తి ఇ.వి. వేణుగోపాల్, జస్టిస్ టి.వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ కె. సుజన లు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కర్ రావు దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం గావించారు. కార్యనిర్వహణాధికారి శ్రీ స్వామి వారి ప్రసాదాలు, శ్రీ స్వామి వారి అనుమతి. ప్రధానతో పాటు శివాలయం పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆలయ మాడవీదులు పరిసర ప్రాంతాలు, భక్తుల సౌకర్యార్థం ఇటివల ఏర్పాటు చేసిన భారీ ఎల్.ఈ.డి స్క్రీన్ సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన మండపాన్ని చూశారు.