53
దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా, ఫైలేరియా, వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా సోమవారం వేంపల్లి ఇమామ్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటా ఫీవర్, లార్వా సర్వేలు చేపట్టారు. దోమల నివారణకు సైఫోనోథ్రిన్ పిచికారి చేశారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో విష జ్వరాలు ప్రభలకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.