65
మలేరియా వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే, వ్యాధి నివారణ సాధ్యమని జిల్లా మలేరియా అధికారి మనోరమ పేర్కొన్నారు. వేంపల్లి మండలంలోని తాళ్ళపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆమె సిబ్బందికి మలేరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, బోధకాలు, ఫైలేరియా, మెదడు వాపు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కోరారు.